సీఎంపై వారెంట్ ఇవ్వడం దేశ చరిత్రలో లేదు

సీఎంపై వారెంట్ ఇవ్వడం దేశ చరిత్రలో లేదు

ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిపై అరెస్ట్ వారెంట్ ఇవ్వడం దేశ చరిత్రలో లేదని టీడీపీ సీనియర్ నేత నామా నాగేశ్వరరావు మండిపడ్డారు. శుక్రవారం ఎన్టీఆర్ భవన్ లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ... మహారాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు మీద నాన్ బెయిల్ కేసు పెట్టడం దారుణం. బాబ్లీ వల్ల తెలంగాణ ఎడారి అవుతుందని ప్రాజెక్టు నిర్మాణాన్ని చూడ్డానికి ఆనాడు 80 మంది వెళ్ళాము.. తెలంగాణ బార్డర్ లో ఉండగానే మమ్మల్ని అరెస్ట్ చేసి ధర్మాబాద్ లో పెట్టారని తెలిపారు. ఒకే గదిలో మమ్మల్ని 80 మందిని నిర్బంధించారు. అక్కడ నరకం అనుభవించాం, అయినా సరే మహారాష్ట్ర ప్రభుత్వ మెడలు వంచాలని భరించామని తెలిపారు. తెలంగాణ కోసం అక్కడ అనేక బాధలు పడ్డాము.. మహారాష్ట్ర వైఖరితో ఆనాడు చంద్రబాబు ఎంతో బాధ పడ్డారన్నారు.

మేము ఎన్డీయే నుంచి బయటకు రాగానే నాన్ బెయిల్ వారెంట్ ఇవ్వడం కుట్ర కాదా?. కేసులు లేవని చెప్పి ఏమిదేళ్ల తర్వాత వారెంట్ ఇవ్వడం కుట్ర కాదా అని నామా నాగేశ్వరరావు ప్రశ్నించారు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిపై వారెంట్ ఇవ్వడం దేశ చరిత్రలోనే లేదన్నారు. ఎనమిది సెక్షన్ ల కింద కేసులు ఎందుకు పెట్టారని నిలదీశారు. వెంటనే కేసును ఉపసంహరించుకోవాలి.. తెలుగు జాతికి క్షమాపణ చెప్పాలని నామా డిమాండ్ చేశారు.