మోడీ పాకిస్తాన్ ప్రధానమంత్రా...? 

మోడీ పాకిస్తాన్ ప్రధానమంత్రా...? 

విపక్షాలపై మోడీ అనుసరిస్తున్న వైఖరి చూస్తే ఆయన ఇండియాకు కాకుండా పాకిస్థాన్‌కు ప్రధాని అన్నట్టుగా వ్యవహరిస్తున్నారని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా డిమండ్‌పై సీఎం చంద్రబాబునాయుడు చేపట్టిన ధర్మపోరాట దీక్షకు సంఘీభావం తెలిపేందుకు వచ్చిన కేజ్రీవాల్.. ఈ వ్యాఖ్యలు చేశారు.  విపక్షాల పట్ల మోదీ వ్యవహరిస్తున్న తీరుపై ఆయన విరుచుకుపడ్డారు. దేశం మొత్తానికి ప్రధాని గా వ్యవహరించాలిగానీ...ఒక నిర్దిష్ట పార్టీకి కాదు అని స్పష్టం చేశారు.  అయితే బీజీపీయేతర ప్రభుత్వాల పట్ల మోడీ అనుసరిస్తున్న వైఖరి చూస్తే ఆయన పాకిస్థా‌న్‌కే కానీ ఇండియాకు ప్రధాని కాదన్నట్టు కనిపిస్తోందని వెల్లడించారు.