'ఢిల్లీ సీఎం కూతుర్ని కిడ్నాప్‌ చేస్తాం'

'ఢిల్లీ సీఎం కూతుర్ని కిడ్నాప్‌ చేస్తాం'

'నీ కుమార్తెను కిడ్నాప్ చేస్తున్నాం. రక్షించుకోగలిగితే రక్షించుకో' అంటూ ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు ఓ బెదిరింపు ఈ మెయిల్ వచ్చింది. సీఎం కార్యాలయానికి సంబంధించిన మెయిల్‌ అకౌంట్‌కు ఈ నెల 9న ఈ మెయిల్‌ రాగా.. ఆలస్యంగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. గుర్తు తెలియని వ్యక్తుల నుంచి వచ్చిన ఈ హెచ్చరిక మెయిల్‌తో కేజ్రీవాల్ ఇంటి వద్ద పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. ఆయన కుమార్తె హర్షితకు కూడా భద్రతను పెంచారు. బెదిరింపు మెయిల్‌పై దర్యాప్తును సైబర్ సెల్‌కు అప్పగించారు. మెయిల్ ఎక్కడ్నుంచి వచ్చింది? ఎవరు పంపారు అన్న కోణంలో దర్యాప్తు ప్రారంభమైంది.

గతంలో కేజ్రీవాల్‌కు ఇటువంటి హెచ్చరిక మెయిల్స్ వచ్చాయి. అప్పట్లో ఆయనను చంపేస్తామని హెచ్చరించారు. ఇక.. కేజ్రీవాల్‌కు ఇద్దరు పిల్లలు. కూతురు హర్షిత, కుమారుడు పులకిత్. హర్షిత ఢిల్లీ ఐఐటీలో ఇంజినీరింగ్ చదువుతోంది.