14 గంటలుగా కేజ్రీ ధర్నా..

14 గంటలుగా కేజ్రీ ధర్నా..

ఢిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ ఇంటి ముందు 14 గంటల నుంచి ఆ రాష్ట్ర సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ ధర్నా నిర్వహిస్తున్నారు. ఐఏఎస్‌ అధికారుల ధర్నాకు వ్యతిరేకంగా  ఆదేశాలివ్వాలని,  వారిపై చర్యలు తీసుకోవాలని ఆయన గవర్నర్‌ను డిమాండ్ చేస్తున్నారు. నిన్న సాయంత్రం ఆరు గంటల సమయంలో గవర్నర్‌ నివాసానికి మరో ముగ్గురు మంత్రులతో కలిసి చేరుకున్న కేజ్రీ.. కాసేపు వెయిటింగ్‌ రూమ్‌లో వేచిచూశారు. మాట్లాడేందుకు గవర్నర్‌ అంగీకరించకపోవడంతో  కేంద్రానికి, లెఫ్టెనెంట్‌ గవర్నర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. 'గడప వద్దకే రేషన్‌' ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్న ఐఏఎస్‌ అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఆ తర్వాత అక్కడే సోఫాలో నిద్రకు ఉపక్రమించారు. 'నిన్న సాయంత్రం నుంచి మీ కోసం వేచి చూస్తున్నాం. ఇకనైనా అపాయింట్‌మెంట్‌ ఇవ్వండి. మా డిమాండ్లపై దృష్టి సారించేందుకు మీ బిజీ షెడ్యూల్‌ నుంచి మీకు ఇవాళైనా టైమ్‌ దొరుకుతుందని ఆశిస్తున్నాం' అంటూ కొద్ది సేపటి క్రితం మంత్రి సిసోడియా.. గవర్నర్‌కు లేఖ రాశారు.