అగ్రవర్ణాల రిజర్వేషన్లకు ఒవైసీ నో..

అగ్రవర్ణాల రిజర్వేషన్లకు ఒవైసీ నో..

ఉన్నత వర్గాల్లోని పేదలకు 10 శాతం రిజర్వేషన్ కల్పించాలంటూ కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకోవడాన్ని తప్పుబట్టారు ఎంఐఎం అధినేత, హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ... కేబినెట్ నిర్ణయంపై సోషల్ మీడియాతో స్పందించిన ఒవైసీ 'దళితులకు జరిగిన చారిత్రక అన్యాయాన్ని సరిచేసేందుకు రిజర్వేషన్లను తీసుకొచ్చారు. పేదరికాన్ని అరికట్టడానికి చాలా పథకాలు, కార్యక్రమాలు తీసుకునిరావొచ్చు... కానీ. రిజర్వేషన్లు అన్నవి న్యాయానికి ఉద్దేశించినది. ఆర్థిక కారణాల ఆధారంగా రిజర్వేషన్లను ఇవ్వలేం' అని తన ట్వీట్‌లో స్పష్టం చేశారు ఒవైసీ.