ఎన్ఎస్ఈ కి అశోక్ చావ్లా రాజీనామా 

ఎన్ఎస్ఈ కి అశోక్ చావ్లా రాజీనామా 

నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇండియా బోర్డ్ ఆప్ డైరెక్టర్స్ ఛైర్మెన్  పదవికి అశోక్ చావ్లా రాజీనామా చేశారు. ఆయన రాజీనామా తక్షణమే అమలులోకి రానుంది. ఎయిర్ సెల్ మాక్సిస్ కేసులో కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం, ఆయన కుమారుడు కార్తీతో ఐదుగురుని విచారించేందుకు ఢిల్లీ కోర్టు అనుమతి నిచ్చింది. ఇందులో అశోక్ చావ్లా కూడా ఉన్నారు.  మాజీ ఆర్థిక వ్యవహారాల సెక్రటరీ అశోక్ ఝా, అదనపు సెక్రటరీ అశోక్ చావ్లా, ఆర్థిక మంత్రిత్వ శాఖ మాజీ జాయింట్ సెక్రటరీ కుమార్ సంజయ్ కృష్ణా, మాజీ డైరెక్టర్ దీపక్ కుమార్ , అండర్ సెక్రటరీ రామ్ శరన్ ను విచారించేందుకు కోర్టు అనుమతి ఇచ్చింది. ఈ ఐదుగురులో ముగ్గురు వివిధ గవర్నమెంటు విభాగాల్లో పనిచేస్తున్నారు. మరో ఇద్దరు ఇప్పటికే రిటైర్ అయ్యారు.