'కార్తికేయ' సీక్వెల్ కు ప్రొడ్యూసర్ దొరికినట్లే!

'కార్తికేయ' సీక్వెల్ కు ప్రొడ్యూసర్ దొరికినట్లే!

నిఖిల్ కెరీర్ బెస్ట్ హిట్స్ లో 'కార్తికేయ' ఒకటి. ఈ చిత్రంతో చందు మొండేటి దర్శకుడిగా పరిచయమయ్యాడు. ఈ సినిమా సక్సెస్ కావడంతో సీక్వెల్ చేయాలని అనుకున్నారు. కానీ ఈసారి భారీ బడ్జెట్ తో సినిమా చేయాలనేది చందు మొండేటి ఆలోచన. అయితే నిఖిల్ మార్కెట్ కు మించి బడ్జెట్ కోట్ చేయడంతో నిర్మాతలు ఎవరూ సాహసించలేదు. మైత్రి మూవీ మేకర్స్ లో చేయడానికి ప్రయత్నించారు కానీ వర్కవుట్ కాలేదు. 

అయితే ఇప్పుడు ఈ సినిమాకు నిర్మాత దొరికినట్లు తెలుస్తోంది. డిస్ట్రిబ్యూషన్ రంగంలో ఉన్న ఏషియన్ సునీల్ ఇప్పుడు నిర్మాతగా మారడానికి రెడీ అవుతున్నారు. భారీ బడ్జెట్ సినిమాలు ప్లాన్ చేస్తున్నారు. ఈ క్రమంలో దర్శకుడు చందు 'కార్తికేయ' సీక్వెల్ కథను వినిపించి ఓకే చేయించుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం చందు మొండేటి 'సవ్యసాచి'తో నిఖిల్ 'ముద్ర' సినిమాలతో బిజీగా ఉన్నారు. అవి ఓ కొలిక్కి వచ్చిన తరువాత 'కార్తికేయ2' సెట్స్ పైకి వెళ్లనుంది.