సూయజ్ రాకెట్ కి ప్రమాదం

సూయజ్ రాకెట్ కి ప్రమాదం

అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి ఇద్దరు వ్యోమగాములను తీసుకెళ్తున్న రష్యాకు చెందిన సూయజ్ రాకెట్ కి పెద్ద ప్రమాదం తప్పింది. రోదసివైపు దూసుకెళ్తున్న రాకెట్ మధ్యలోనే చెడిపోయింది. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్‌కు బయల్దేరిన రాకెట్ బూస్టర్‌లో సమస్య తలెత్తింది.  దీంతో రాకెట్లోని ఇద్దరు వ్యోమగాములు బాలిస్టిక్ డీసెంట్ మోడ్‌లో తిరిగి భూమిపైకి దిగారు. వీరు దిగిన ప్రదేశం కజకిస్థాన్‌లో ఉంది. ఇద్దరు ఆస్ట్రోనాట్లు.. రష్యాకు చెందిన అలెక్సీ ఓవ్‌చినిన్, అమెరికాకి చెందిన నిక్ హేగ్ సురక్షితంగా ఉన్నట్టు తెలిసింది. రాకెట్ ల్యాండైన ప్రదేశానికి సహాయ బృందాలు హుటాహుటిన తరలి వెళ్లాయి. బ్యాలిస్టిక్ డీసెంట్ మోడ్ ల్యాండింగ్ సాధారణ ల్యాండింగ్ కంటే ఇది కాస్త వేగంగా జరుగుతుందని నాసా తెలిపింది. సూయజ్ రాకెట్‌లో ఆరు గంటలు  ప్రయాణించి ఐఎస్‌ఎస్‌కు చేరాల్సి ఉంది. వీళ్లిద్దరూ అక్కడ ఆర్నెల్లు ఉండాల్సి ఉంది.