కాలిఫోర్నియాలో కాల్పులు.. 13 మంది మృతి

కాలిఫోర్నియాలో కాల్పులు.. 13 మంది మృతి

అమెరికా కాలిఫోర్నియాలోని ఓ బార్ దగ్గర కాల్పులు జరిగాయి. థౌజెండ్ ఓక్స్ ప్రాంతంలోని బోర్డర్‌లైన్ బార్ అండ్ గ్రిల్‌లో ఓ బార్‌లో ఈ ఘ‌ట‌న జ‌రిగింది. ఈ కాల్పుల్లో మొత్తం 13 మంది చనిపోయారు. కనీసం 11 మందికి పైగా గాయ‌ప‌డిన‌ట్లు తెలుస్తోంది. బుల్లెట్ గాయాలైన వారిని హాస్పిట‌ల్‌కు త‌ర‌లించారు. బార్ ప‌రిస‌ర ప్రాంతాల‌కు ఎవ‌రూ వెళ్లరాదంటూ పోలీసులు ఆదేశించారు. కాలేజీ కౌంటీ మ్యూజిక్ నైట్ జ‌రుగుతుండగా తుపాకీతో లోపలికి చొరబడిన సాయుధుడు సుమారు 30 రౌండ్లు కాల్పులు జ‌రిపిన‌ట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. గ‌న్‌తో బార్‌లోకి చొర‌బ‌డిన ఓ వ్యక్తి గేటు దగ్గర బౌన్సర్‌ను కాల్చాడు. ఆ త‌ర్వాత అత‌ను స్మోక్ డివైస్‌ల‌ను వాడి డ్యాన్స్ ఫ్లోర్ మీద ఉన్న యువ‌త‌పై ఫైరింగ్ ఓపెన్ చేశాడు. కాలేజీ కౌంటీ మ్యూజిక్‌లో సుమారు 200 మంది పాల్గొన్నారు. అనేక రౌండ్ల కాల్పులు త‌ర్వాత సాయుధుడు ఆత్మహ‌త్య చేసుకున్నట్లు పోలీసులు చెబుతున్నారు.