నడిరోడ్డుపై ప్రేమోన్మాది ఘాతుకం

నడిరోడ్డుపై ప్రేమోన్మాది ఘాతుకం

హైదరాబాద్‌లో మరో ప్రేమోన్మాది రెచ్చిపోయాడు. భరత్‌ అనే ఓ యువకుడు.. ప్రేమించమంటూ ఓ విద్యార్థిని వెంటపడి ఆమె నిరాకరించడంతో కొబ్బరి బొండాల కత్తితో దాడి చేశాడు. కాచిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని బర్కత్‌పుర ప్రాంతంలో ఇవాళ ఉదయం ఈ దారుణం జరిగింది. గాయపడిన విద్యార్థిని.. ఓ ప్రైవేట్ కళాశాలలో ఇంటర్మీడియట్ సెకండియర్ చదువుతోంది. గాయపడిన విద్యార్థినిని మెరుగైన చికిత్స కోసం మలక్‌పేటలోని యశోద ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది.