కోడి కత్తికేసు: ఎన్‌ఐఏ కస్టడీకి నిందితుడు..

కోడి కత్తికేసు: ఎన్‌ఐఏ కస్టడీకి నిందితుడు..

సంచలనం సృష్టించిన కోడికత్తి కేసులో నిందితుడు శ్రీనివాసరావును ఇవాళ ఎన్‌ఐఏ కస్టడీలోకి తీసుకోనుంది... వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిపై విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో జరిగిన దాడి కేసులో నిందితుడు శ్రీనివాసరావును ఎన్‌ఐఏ కస్టడీకి అప్పగిస్తూ విజయవాడ కోర్టు నిన్న ఆదేశాలు ఇవ్వగా... ఇవాళ ఉదయం 10 గంటలకు ఎన్‌ఐఏ అధికారులు నిందితుడిని అదుపులోకి తీసుకోనున్నారు. కాగా, శ్రీనివాసరావును వారం రోజుల పాటు ప్రశ్నించేందుకు కోర్టు అనుమతించింది.