మెహిదీపట్నంలో యువకుడిపై కత్తితో దాడి...

మెహిదీపట్నంలో యువకుడిపై కత్తితో దాడి...

హైదరాబాద్‌లో ఓ యువకుడిపై జరిగిన దాడి మరోసారి కలకలం సృష్టించింది. మెహిదీపట్నంలో నడిరోడ్డుపై ఓ యువకుడిని అతి దారుణంగా కత్తితో పొడిచి పరారయ్యాడు ఆ యువకుడి స్నేహితుడు. వివరాల్లోకి వెళితే... ఫిరోజ్‌, సద్దాం ఇద్దరు మిత్రులు... సద్దాం దగ్గర ఫిరోజ్ రూ. 5000 అప్పుగా తీసుకొని సరైన తిరిగి ఇచ్చేందుకు ఆలస్యమైంది... ఈ డబ్బు విషయంలో ఇద్దరు స్నేహితుల మధ్య వివాదం చోటుచేసుకుంది... మాటమాట పెరిగి చివరకు దాడి వరకు వచ్చింది. కోపంతో ఊగిపోయిన సద్దాం తన దగ్గరున్న కత్తితో ఫిరోజ్‌పై కత్తితో దాడి చేశాడు. దీంతో ఫిరోజ్ అక్కడికక్కడే కుప్పకూలిపోగా... సద్దాం పరారయ్యాడు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు... ఫిరోజ్‌ను చికిత్స కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. పరారీలో ఉన్న సద్దాం కోసం గాలింపు చర్యలు చేపట్టినట్టు ఆసిఫ్‌నగర్‌ పోలీసులు తెలిపారు.