3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ భారత్

3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ భారత్

ఆస్ట్రేలియాతో జరుగుతున్న వన్డే సిరీస్ తొలి మ్యాచ్ లో టీమిండియా కష్టాల్లో పడింది. సిడ్నీలో జరుగుతున్న ఆరంభ మ్యాచ్ లో 289 పరుగుల టార్గెట్ చేజింగ్ కి దిగిన భారత జట్టు మూడు వికెట్లు కోల్పోయింది. బెహ్రన్‌డోర్ఫ్‌ వేసిన తొలి ఓవర్ ఆఖరు బంతికి శిఖర్‌ ధావన్‌ పరుగులేమీ చేయకుండా ఎల్బీడబ్ల్యు అయ్యాడు. కెప్టెన్ కోహ్లీ రిచర్డ్‌సన్‌ వేసిన నాలుగో ఓవర్లో 3 పరుగులకే పెవిలియన్‌ చేరాడు. అదే ఓవర్లో రాయుడు డకౌట్ అయి వెనుదిరిగాడు. ఓపెనర్ రోహిత్ శర్మతో కలిసి ఎంఎస్ ధోనీ ఇన్నింగ్స్ చక్కదిద్దే పనిలో ఉన్నాడు.