సిడ్నీ వన్డేః నిలకడగా ఆసీస్ బ్యాటింగ్

సిడ్నీ వన్డేః నిలకడగా ఆసీస్ బ్యాటింగ్

భారత్ తో సిడ్నీ వేదికగా జరుగుతున్న తొలి వన్డేలో ఆసీస్ జట్టు నిలకడగా ఆడుతుంది. 45 ఓవర్లు ముగిసే సరికి నాలుగు వికెట్ల నష్టానికి 229 పరుగులు చేసింది. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా కెప్టెన్ అరోన్ ఫించ్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఇన్నింగ్స్ మూడో ఓవర్‌లోనే భువనేశ్వర్ కుమార్ బౌలింగ్‌లో ఓపెనర్ అరోన్ ఫించ్ (6: 11 బంతుల్లో) క్లీన్ బౌల్డ్ కాగా.. కాసేపు దూకుడుగా ఆడిన మరో ఓపెనర్ అలెక్స్ క్యారీ (24: 34 బంతుల్లో 5x4) స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. మొదటి నుంచి నిలకడగా ఆడిన ఉస్మాన్ ఖవాజా (59: 81 బంతుల్లో 6x4) హఫ్ సెంచరీ చేసి జడేజా బౌలింగ్‌లో వెనుదిరిగాడు. షాన్ మార్ష్ (54: 70 బంతుల్లో 4x4) అర్థ శతకం సాధించి కుల్ దీప్ బౌలింగ్ లో షమికి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ప్రస్తుతం క్రీజ్ లో పీటర్ హ్యండ్ కాంబ్ 54, మార్కస్ స్టోనిస్ 21 పరుగులతో ఉన్నారు.

భారత్ జట్టు ముగ్గురు ఫాస్ట్ బౌలర్లు, ఇద్దరు స్పిన్నర్ల కాంబినేషన్‌తో బరిలోకి దిగింది. సస్పెండ్‌కి గురైన హార్దిక్ పాండ్య స్థానంలో రవీంద్ర జడేజా తుది జట్టులోకి రాగా.. మహేంద్రసింగ్ ధోనీ దాదాపు మూడు నెలల తర్వాత మళ్లీ టీమిండియా తరపున గ్రౌండ్ లోకి దిగాడు.