భారత్ ను ఆదుకున్న పుజారా

భారత్ ను ఆదుకున్న పుజారా

అడిలైడ్ వేదికగా జరుగుతున్న మొదటి టెస్ట్ మ్యాచ్ లో భారత్ బ్యాట్స్ మెన్ శతేశ్వర పుజారా తన అర్ధ సెంచరీతో జట్టును ఆదుకున్నారు. అశ్విన్ తో కలిసి నిలకడగా రాణిస్తున్నారు. 67 ఓవర్లు ముగిసే సరికి భారత్ ఆరు వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. టాస్ గెలిచి బ్యాటింగ్ కు దిగిన భారత్ ను ఆసీస్ బౌలర్లు కట్టడి చేశారు. ఓపెనర్లు కేఎల్ రాహుల్ (2), మురళీ విజయ్ (11) మ‌రోసారి నిరాశ ప‌ర‌చ‌గా.. కెప్టెన్ విరాట్ కోహ్లి (3), అజింక్య రహానె (13), రోహిత్ శర్మ(37), రిషబ్ పంత్ (25) తొంద‌ర‌గానే పెవిలియ‌న్ చేరుకున్నారు.  ఆసీస్ బౌలర్లలో హేజిల్ వుడ్, నాథన్ లైయాన్ చెరో రెండు వికెట్లు, పాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్ ఒక్కో వికెట్ తీశారు. ప్రస్తుతం చతేశ్వర పుజారా (64 బ్యాటింగ్, 177 బంతుల్లో.. 5 ఫోర్లు), అశ్విన్ (15 బ్యాటింగ్, 53 బంతుల్లో) క్రీజ్ లో ఉన్నారు. వీరిద్దరు ఏడో వికెట్ కు 44 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశారు.