అడిలైడ్ టెస్ట్ లో పుజారా సెంచరీ

అడిలైడ్ టెస్ట్ లో పుజారా సెంచరీ

ఆస్ట్రేలియాతో అడిలైడ్ లో జరుగుతున్న మొదటి టెస్ట్ లో భారత జట్టు 9 వికెట్ల నష్టానికి 250 పరుగులు చేసింది. బ్యాట్స్ మెన్ పుజారా (123, 246 బంతుల్లో, 7 ఫోర్లు, 2 సిక్స్) సెంచరీతో జట్టును ఆదుకున్నాడు. కెరీర్ లో తన 16వ సెంచరీ నమోదు చేశాడు. 56 పరుగులకే నాలుగు కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న సమయంలో బాధ్యతయుతంగా ఆడాడు. ఓపెనర్లు కేఎల్ రాహుల్ (2), మురళీ విజయ్ (11) మ‌రోసారి నిరాశ ప‌ర‌చ‌గా.. కెప్టెన్ విరాట్ కోహ్లి (3), అజింక్య రహానె (13), రోహిత్ శర్మ(37), రిషబ్ పంత్ (25), అశ్విన్ (25), ఇషాంత్ శర్మ(4) త్వరగానే పెవిలియన్ చేరారు. ఆసీస్ బౌలర్లలో హేజిల్ వుడ్, నాథన్ లైయాన్, పాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్ అందరు రెండు వికెట్లు తీశారు.