లంచ్ సమయానికి భారత్ స్కోర్ 56/4

లంచ్ సమయానికి భారత్ స్కోర్ 56/4

ఆడిలైడ్ వేదిక‌గా జ‌రుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్‌లో భారత్ కష్టాల్లో ఉంది. ముందుగా టాస్ గెలిచిన భారత్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్లు తక్కువ స్కోర్లకే  పెవిలియన్ కు చేరారు. ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌల‌ర్స్ దాటికి లంచ్ సమయానికి భార‌త్ నాలుగు వికెట్ల నష్టానికి 56 పరుగులు చేసింది. ఆస్రేలియా బౌలర్స్‌లో హాజిల్‌వుడ్‌కి రెండు వికెట్స్ ద‌క్కగా, స్టార్క్‌, క‌మిన్స్ చెరో వికెట్ తీసారు. ఓపెనర్లు కేఎల్ రాహుల్ (2), మురళీ విజయ్ (11) మ‌రోసారి నిరాశ ప‌ర‌చ‌గా.. కెప్టెన్ విరాట్ కోహ్లి (3), అజింక్య రహానె (13) తొంద‌ర‌గానే పెవిలియ‌న్ చేరుకున్నారు. ప్రస్తుతం క్రీజులో చతేశ్వర్ పుజారా (11 బ్యాటింగ్: 62 బంతుల్లో ఒక ఫోర్), రోహిత్ శర్మ (15 బ్యాటింగ్: 23 బంతుల్లో ఒక ఫోర్,ఒక సిక్స్ ) ఉన్నారు.