బ్యాడ్‌లైడ్‌.. నిలిచిన ఆట

బ్యాడ్‌లైడ్‌.. నిలిచిన ఆట

సిడ్నీ వేదికగా భారత్‌, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న నాలుగో టెస్టు మ్యాచ్ వెలుతురులేమి కారణంగా నిలిచిపోయింది. దీంతో టీ బ్రేక్ అనంతరం ఆట సాగలేదు. అయితే అంపైర్లు మరో 15  నిమిషాల్లో ఆట సాగేది లేనిది తేల్చనున్నారు. నాలుగవ రోజు ఉదయం వర్షం కారణంగా 3 గంటల పాటు ఆట సాగలేదు. వర్షం తగ్గడంతో రెండవ సెషన్ లో ఆట మొదలైంది. ఈ సెషన్ లో భారత బౌలర్ల ధాటికి తొలి ఇన్నింగ్స్‌లో 300 పరుగులకు ఆసీస్ ఆలౌట్ అయింది. దీంతో భారత్‌కు 322 పరుగుల భారీ ఆధిక్యం దక్కడంతో.. భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ ఆసీస్ ను ఫాలోఆన్‌ ఆడిస్తున్నాడు. టీ బ్రేక్  సమయానికి ఆసీస్ 4 ఓవర్లలో వికెట్ కోల్పోకుండా 6 పరుగులు చేసింది. టీ బ్రేక్ అనంతరం వెలుతురులేమి కారణంగా ఆట నిలిచిపోయింది. నిన్న కూడా వెలుతురులేమి కారణంగా ఒక గంట మ్యాచ్ సమయం వృథా అయ్యింది.