సిడ్ని టెస్ట్ః వర్షంతో తాత్కాలికంగా నిలిపివేత

సిడ్ని టెస్ట్ః వర్షంతో తాత్కాలికంగా నిలిపివేత

సిడ్ని వేదికగా ఆస్ట్రేలియా, భారత్ జట్ల మధ్య జరుగుతున్న ఆఖరి టెస్ట్ కు వర్షం అడ్డంకిగా మారింది. ఉదయం నుంచి కురుస్తున్న వర్షం కారణంగా అంపైర్లు ఆటను తాత్కాలికంగా నిలిపివేశారు. రెండో ఇన్నింగ్స్ లో ఆసీస్ 6/0 స్కోర్ చేసింది. ప్రస్తుతం క్రీజులో ఉస్మాన్‌ ఖవాజా(4), మార్కస్‌ హారిస్‌(2) ఉన్నారు. భారత్‌ 316 పరుగుల ఆధిక్యంలో ఉంది. తొలి ఇన్నింగ్స్‌లో 300 పరుగులకు ఆలౌటైన ఆస్ట్రేలియా జట్టు ఫాలో ఆన్‌ ఆడుతోంది. కుల్‌దీప్ యాదవ్‌ ఐదు వికెట్లు, షమీ, జడేజా చెరో రెండు వికెట్లు, బుమ్రా ఒక వికెట్ తీశారు. టీమిండియా తన మొదటి ఇన్నింగ్స్ లో 7 వికెట్ల నష్టానికి 622 పరుగులు చేసిన సంగతి తెలిసిందే.