30ఏళ్ల తర్వాత 'ఫాలో ఆన్'...

30ఏళ్ల తర్వాత 'ఫాలో ఆన్'...

సిడ్నీ వేదికగా భారత్‌, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న నాలుగో టెస్టు మ్యాచ్‌ తొలి ఇన్నింగ్స్ లో ఆసీస్ 300 పరుగులకు ఆలౌట్ అయింది. ఓవర్‌నైట్ స్కోరు 236/6తో నాలుగవ రోజు తొలి ఇన్నింగ్స్‌‌ని కొనసాగించిన ఆసీస్ కుల్దీప్ యాదవ్ ధాటికి 300 పరుగులకు కుప్పకూలిపోయింది. దీంతో భారత్‌కి 322 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. ఒకవైపు భారీ ఆధిక్యం, మరోవైపు కేవలం నాలుగు సెషన్ల ఆట మాత్రమే మిగిలి ఉండడంతో.. భారత  కెప్టెన్ విరాట్ కోహ్లీ ఆస్ట్రేలియా‌ని ఫాలో‌ఆన్ ఆడించాడు.

1988 తర్వాత సొంతగడ్డపై ఆస్ట్రేలియా ఫాలో‌ఆన్ ఆడటం ఇదే తొలిసారి. ఆస్ట్రేలియా జట్టుని వారి సొంతగడ్డపై భారత్ 31 ఏళ్ల తర్వాత ఫాలో‌ఆన్ ఆడించింది. 1988లో సిడ్నీ వేదికగానే ఇంగ్లాండ్ జట్టు ఆసీస్ ను వారి సొంతగడ్డపై ఫాలో‌ఆన్ ఆడించింది. ఇక 2005లో ఆస్ట్రేలియా ఫాలో‌ఆన్ ఆడినా.. అది ఇంగ్లాండ్ లోని ట్రెంట్ బ్రిడ్జ్ లో ఆడింది. అయితే మెల్‌బోర్న్ వేదికగా ముగిసిన మూడో  టెస్టులోనే ఆస్ట్రేలియాను ఫాలోఆన్ ఆడించే అవకాశం భారత్‌కి లభించింది. కానీ కోహ్లీ రెండో ఇన్నింగ్స్‌కే మొగ్గు చూపాడు.