ఇండియాతో వన్డేలకు 1980 జెర్సీలతో..

ఇండియాతో వన్డేలకు 1980 జెర్సీలతో..

సొంత గడ్డపై టీమిండియా చేతిలో ఘోర పరాజయం పాలైన ఆస్ట్రేలియా.. వన్డే సిరీస్‌లోనైనా సత్తా చాటాలని భావిస్తోంది. టాలెంటెడ్‌ ప్లేయర్స్‌ ఉన్నా అదృష్టం కలిసిరాక ఓడామని చెబుతున్న ఆస్ట్రేలియ ఆటగాళ్లు.. కాస్త వెరైటీగా ఆలోచించి ఓ నిర్ణయం తీసుకున్నారు. 1980 దశకంలో తమ జట్టు ఆటగాళ్లు ధరించిన జెర్సీల వంటివే ఇప్పుడూ ధరించాలని ఫిక్స్‌ అయ్యారు.  భారత్‌తో 1985-86లో జరిగిన మూడు మ్యాచ్‌ల సిరీస్‌ని ఆస్ట్రేలియా 2-0తో చేజిక్కించుకుంది. అప్పట్లో ఆటగాళ్లు ధరించిన జెర్సీ స్టైల్‌‌లోనే లేటెస్ట్‌గా మళ్లీ జెర్సీలను తయారు చేయించారు. ఈ జెర్సీలతోనే వన్డే సిరీస్‌లో గ్రౌండ్‌లోకి దిగబోతున్నారు.