హైదరాబాద్‌కు షిప్ట్‌ చేయండి..

హైదరాబాద్‌కు షిప్ట్‌ చేయండి..

పుదుకొట్టై మెడికల్ కాలేజ్‌లో సరైన వైద్యం అందడం లేదని, వైద్యుల భాష అర్థం కావడం లేదు... వెంటనే తమకు హైదరాబాద్‌కు షిప్ట్ చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు క్షతగ్రాత్రులు... మెదక్ జిల్లా నర్సాపూర్‌కు చెందిన భక్తులు పుదుకొట్టై  దగ్గర ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే... ఈ ఘటన మృతిచెందినవారి భౌతికకాయాఆలు నర్సాపూర్‌ చేరుకోగా... మరోవైపు పుదుకొట్టైలో ఇంకా ఐదుగురు క్షతగాత్రులు చికిత్స పొందుతున్నారు. ఆసుపత్రిలో సరైన వైద్యం అందడం లేదని క్షతగాత్రుల వీడియో రికార్డు చేసి సోషల్ మీడియాలో పెట్టారు. ఇక్కడి వైద్యుల భాష అర్థం కావడం లేదు.. త్వరగా హైదరాబాద్‌కు షిఫ్ట్ చేయాలని విజ్ఞప్తి చేశారు.