బాహుబలే కాదు ఆఫీసర్ కూడా..

బాహుబలే  కాదు ఆఫీసర్ కూడా..

ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన బాహుబలి సిరీస్ ఎలాంటి విజయాన్ని నమోదు చేసుకుందో ప్రత్యేకించి చెప్పక్కరలేదు.  ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా భారీ కలెక్షన్లను రాబట్టింది.  దాదాపుగా రూ 2000 కోట్లు గ్రాస్ వసూలు చేసి రికార్డు నెలకొల్పింది.  తెలుగు సినిమా వైభవాన్ని దశదిశలా చాటి చెప్పిన సినిమాగా బాహుబలి నిలించింది.  ఈ రికార్డులను బ్రేక్ చేయడం ఇప్పట్లో సాధ్యం కాకపోవచ్చు.  కొన్నాళ్లపాటు ఈ సినిమా రికార్డ్ ఇలాగే ఉంటుంది అనడంలో సందేహం లేదు.  

ఇక ఇదిలా ఉంటే, శివ సినిమాతో దర్శకుడిగా తన స్టామినాను నిలబెట్టుకున్న రామ్ గోపాల్ వర్మ, రెండు దశాబ్దాల తరువాత నాగార్జునతో ఆఫీసర్ సినిమా చేశాడు.  పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ కథతో వచ్చిన ఈ సినిమా జూన్ 1 వ తేదీన విడుదలైంది.  వివాదాలను పక్కన పెట్టి వర్మ ఈ సినిమాను చేశాడు.  ఈ సినిమాలో మునుపటి వర్మను చూడొచ్చని అందరు అనుకున్నారు.  కానీ, అందరి అంచనాలను తలకింద్రులు చేస్తూ.. వర్మ ఎప్పటిలాగే రొటీన్ గా తీసి ప్రేక్షకులకు నీరసం తెప్పించాడు.   ఇప్పుడు వస్తున్నా కొత్త హీరోల సినిమాలు ఒక్కరోజులోనే కోటి రూపాయల షేర్ ను వసూలు చేస్తుంటే.. నాగార్జున వంటి స్టార్ ఇమేజ్ ఉన్ననటుడితో.. వర్మ తీసిన ఆఫీసర్ లాంగ్ రన్ లో ఇప్పటి వరకు కేవలం కోటి రూపాయలు మాత్రమే షేర్ వసూలు చేసింది.  ఇలాంటి డిజాస్టర్ రికార్డు ఏ సినిమాకు రాదేమో.