బాలయ్య AK 47

బాలయ్య AK 47

బాలకృష్ణ, వివి వినాయక్ కాంబినేషన్ లో త్వరలోనే ఓ ప్రాజెక్టు రానున్న సంగతి తెలిసిందే. సి కళ్యాణ్ నిర్మాత వ్యవహరించనున్న ఈ ప్రాజెక్టును మొన్న బాలకృష్ణ పుట్టినరోజు నాడు దర్శకుడు వినాయక్ అధికారికంగా ప్రకటించారు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాకు AK 47 అనే పవర్ ఫుల్ టైటిల్ పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. కథ ప్రకారం బాలయ్య బాబు ఫ్యాక్షన్ లీడర్ గా కనిపిస్తాడట. రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో ఉన్న ఈ కథలో బాలయ్య పాత్ర ఊహకందని రీతిలో ఉంటుందట. మరోవైపు త్వరలోనే బాలయ్య చేయబోయే ఎన్టీఆర్ బయోపిక్ షూటింగ్ పూర్తి కాగానే ఈ ప్రాజెక్టు సెట్స్ మీదకు తీసుకెళ్తారట. ప్రస్తుతం వినాయక్ అండ్ టీం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో నిమగ్నమయ్యారు. గతంలో వీరి కాంబోలో వచ్చిన చెన్నకేశవ రెడ్డి చిత్రం మంచి ఆదరణను పొందిన నేపథ్యంలో మంచి బజ్ ఏర్పడింది.