అందుకే కాంగ్రెస్‌లో చేరా: బండ్ల గణేష్‌

అందుకే కాంగ్రెస్‌లో చేరా: బండ్ల గణేష్‌

కాంగ్రెస్‌ పార్టీ అంటే తనకు చిన్నప్పటి నుంచి ఇష్టమని.. అందుకే ఆ పార్టీలో చేరానని ప్రముఖ నిర్మాత, వ్యాపారవేత్త బండ్ల గణేష్‌ చెప్పారు. రాహుల్‌ గాంధీ సమక్షంలో ఇవాళ పార్టీలో చేరిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రజాసేవ చేసేందుకు తనకు కాంగ్రెస్‌ పార్టీ అనువుగా ఉంటుందన్నారు. కాంగ్రెస్‌ పార్టీ త్యాగాలకు ప్రతిరూపమన్న గణేష్‌.. పార్టీ కోసం పదవులను సైతం వదులుకున్న రాహుల్‌గాంధీ నేతృత్వంతో ఆ పార్టీలో చేరడం ఆనందంగా ఉందన్నారు.  పార్టీ ఎక్కడి నుంచి పోటీ చేయమని ఆదేశిస్తే అక్కడ నుంచి బరిలోకి దిగుతానని బండ్ల చెప్పారు. సామాన్య కార్యకర్తగా ఉండిపోమన్నా తనకేం అభ్యంతరం లేదన్నారు. తనకు కాంగ్రెస్‌.. కమిట్మెంట్‌ ఇవ్వలేదన్న బండ్ల.. ప్రజాసేవ చేసందుకే రాజకీయాల్లోకి వస్తున్నానని చెప్పారు. ఎమ్మెల్యే అవ్వాలన్నదే తన కోరిక, ఆశ అని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.