ఆసియాకప్ బంగ్లాదే...

ఆసియాకప్ బంగ్లాదే...

మహిళల ఆసియాకప్ టీ-20 టోర్నీ ఫైనల్ లో భారత జట్టుపై బంగ్లాదేశ్‌ విజయం సాధించింది. చివరి ఓవర్ వరకు ఉత్కంఠంగా సాగిన ఈ మ్యాచ్ లో భారత మహిళల జట్టుపై మూడు వికెట్ల తేడాతో బంగ్లా గెలిచి మహిళల ఆసియాకప్ టీ-20 టోర్నీని కైవసం చేసుకుంది. ముందుగా టాస్‌ ఓడిన భారత మహిళల జట్టు బ్యాటింగ్‌ను స్మృతి మందాన, మిథాలీ రాజ్‌లు ప్రారంభించారు. బంగ్లా బౌలర్ల ధాటికి ఇన్నింగ్స్ ఆరంభంలో భారత బ్యాట్స్‌ఉమెన్‌ తడబడ్డారు. జట్టు స్కోరు 12 వద్ద ఓపెనర్ స్మృతి మంధాన(7) రనౌట్‌ అయింది. అనంతరం క్రీజులోకి వచ్చిన దీప్తి శర్మ(4), మరో ఓపెనర్ మిథాలీ రాజ్(11)లు కూడా స్వల్ప వ్యవధిలోనే పెవిలియన్ చేరడంతో భారత జట్టు కష్టాల్లో పడింది. ఈ దశలో క్రీజులోకి వచ్చిన హర్మన్‌ప్రీత్ కౌర్.. బంగ్లా బౌలర్లను ఎదుర్కొని స్కోర్ బోర్డును ముందుకు నడిపింది. హర్మన్ కౌర్‌ గ్రీజ్ లో ఉన్నా.. మరో ఎండ్ లో సహకారం ఇచ్చేవాళ్ళు కరువయ్యారు. చివరి వరకు క్రీజులో ఉన్న కౌర్(56) అర్ధ సెంచరీతో జట్టు స్కోరును 100 పరుగుల మార్క్‌ను దాటించింది. నిర్ణీత 20 ఓవర్లలో భారత మహిళలు తొమ్మిది వికెట్ల నష్టానికి 112 పరుగులు మాత్రమే చేసింది. బంగ్లా బౌలర్లలో తుల్ కుబ్రా, రుమానా అహ్మద్ తలో రెండు వికెట్లు తీశారు.

అనంతరం 113 పరుగుల విజయ లక్ష్యంను బాంగ్లాదేశ్ 20 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి విజయం సాధించింది. బంగ్లా ఓపెనర్లు సుల్తానా, రెహమాన్ లు మంచి శుభారంభం ఇచ్చారు. ఈ జోడి 35 పరుగుల బాగస్వామ్యంను నెలకొల్పిన అనంతరం రెహమాన్(17), సుల్తానా(16)లు పెవిలియన్ చేరారు. అనంతరం గ్రీజ్ లోకి వచ్చిన  హౌక్(11)కూడా అవుట్ అయింది. మూడు వికెట్లు కోల్పోయిన దశలో నిగర్ సుల్తానా(27), అహ్మద్(23)లు బంగ్లా జట్టును ఆదుకున్నారు. ఇక చివరి ఓవర్లో బంగ్లా విజయానికి 9 పరుగులు అవసరం కాగా.. రెండు వికెట్లు కోల్పోవడంతో ఉత్కంఠ ఏర్పడింది. చివరి బంతికి రెండు పరుగులు అవసరం కాగా బంగ్లా బ్యాట్స్ మెన్ అలామ్ విన్నింగ్ షూట్ కొట్టి ఆసియాకప్ ను అందించింది. 'ప్లేయర్ అఫ్ ది మ్యాచ్' రుమానా అహ్మద్ కు, 'ప్లేయర్ అఫ్ ది సిరీస్' హర్మన్ కు దక్కింది.