టీమిండియాకు బీసీసీఐ నజరానా

టీమిండియాకు బీసీసీఐ నజరానా

ఆస్ట్రేలియా గడ్డపై 71 ఏళ్ల తరువాత సీరిస్ నెగ్గిన భారత క్రికెట్ జట్టుకు బీసీసీఐ భారీ నజరానా ప్రకటించింది. టీమ్ సభ్యులు, కోచ్ లు, సహాయ సిబ్బందికి రివార్డులు ఇవ్వనున్నట్లు తెలిపింది. టెస్ట్ జట్టులోని ప్రతి ఆటగాడికి రూ.15లక్షలు, రిజర్వు ఆటగాళ్లకు రూ.7.5 లక్షలు, కోచ్ లకు ప్రోత్సాహకంగా రూ.25లక్షలు చొప్పున ఇవ్వనుంది.