టీమిండియాకు భారీ నజరానా...

టీమిండియాకు భారీ నజరానా...

నాలుగు టెస్టుల సిరీస్‌ను భారత్‌ 2-1 తేడాతో కైవసం చేసుకోవడంతో అస్ట్రేలియా గడ్డపై భారత్‌ తొలిసారిగా టెస్ట్ సిరీస్ గెలిచింది. ఆస్ట్రేలియాలో తొలిసారి టెస్టు సిరీస్ గెలిచిన టీమిండియాకు బీసీసీఐ భారీ నజరానా ప్రకటించింది. టెస్టు జట్టులో ఉన్న 11 మంది ఆటగాళ్లందరికీ ఒక్కొక్కరికి రూ. 15లక్షలను నజరానాగా బీసీసీఐ ప్రకటించింది. ఒక్కో మ్యాచ్‌కు ఫీజు కింద వారికి చెల్లిస్తున్న మొత్తాన్నే బోనస్‌గా ప్రకటించింది. అలాగే రిజర్వ్ ఆటగాళ్లకు రూ.7.5లక్షలు.. కోచ్‌లకు ఒక్కొక్కరికీ రూ.25లక్షలు నజరానా అందజేయనుంది. టీమిండియా సపోర్టింగ్ స్టాఫ్ కు వారి ఫ్రొఫెషనల్ ఫీజుకు సమానంగా బోనస్ ప్రకటించింది.