విశాఖలో టీ20.. హైదరాబాద్‌లో వన్డే..

విశాఖలో టీ20.. హైదరాబాద్‌లో వన్డే..

సొంత గడ్డపై ఆస్ట్రేలియాతో భారత్ మరో సమరానికి సిద్దమవనుంది. భారత్ లో ఆస్ట్రేలియా పర్యటన షెడ్యూల్ ను బీసీసీఐ ఖరారు చేసింది. ఈ పర్యటనలో టీమిండియాతో ఆసీస్ టీ-20, వన్డే సిరీస్ ఆడనుంది. ఫిబ్రవరి 24 నుండి మార్చి 13 వరకు భారత్‌లో ఆస్ట్రేలియా పర్యటిస్తుంది. ఫిబ్రవరి 24న మొదటి టీ-20తో ఈ పర్యటన మొదలవుతుంది. ఈ పర్యటనలో ఇరు జట్లు రెండు టీ-20లు, ఐదు వన్డేలు ఆడనున్నాయి. ఫిబ్రవరి 27న రెండవ టీ-20 విశాఖలో, మార్చి 2న హైదరాబాద్ లో మొదటి వన్డే జరగనున్నాయి. భారత కాలమానం ప్రకారం టీ20 మ్యాచ్‌లు రాత్రి 7 గంటలకు, వన్డే మ్యాచ్‌లు మధ్నాహ్నం 1.30 గంటలకు ప్రారంభమవుతాయి.  

షెడ్యూల్:

* ఫిబ్రవరి 24 - మొదటి టీ20 - బెంగళూరు 
* ఫిబ్రవరి 27 - రెండవ టీ20 - విశాఖ 
* మార్చి 2 - మొదటి వన్డే - హైదరాబాద్   
* మార్చి 5 - రెండవ వన్డే - నాగపూర్ 
* మార్చి 8 - మూడవ వన్డే - రాంచి 
* మార్చి 10 - నాలుగవ వన్డే - మొహాలీ
* మార్చి 13 - ఐదవ వన్డే - ఢిల్లీ