హార్థిక్, రాహుల్‌కు నోటీసులు

హార్థిక్, రాహుల్‌కు నోటీసులు

బాలీవుడ్ ద‌ర్శ‌క‌, నిర్మాత క‌ర‌ణ్ జోహార్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న 'కాఫీ విత్ క‌ర‌ణ్‌' టాక్ షోలో ఇటీవ‌ల టీమిండియా క్రికెట‌ర్లు హార్దిక్ పాండ్యా, కేఎల్ రాహుల్ పాల్గొన్నారు. ఈ టాక్ షో‌లో ఇద్దరూ క్రష్, లైప్ స్టైల్ లాంటి అనేక విషయాలను కరణ్‌ జోహార్‌తో పంచుకున్నారు. ముఖ్యంగా పాండ్యా మ‌హిళ‌ల గురించి చుల‌క‌న‌గా మాట్లాడాడు. 'నేను మా ఇంట్లో ఏ విషయం దాచ‌ను. నా శృంగారానికి సంబంధించిన విషయాల‌ను కూడా మా అమ్మానాన్న‌ల‌కు చెబుతా. వ‌ర్జినిటీ కోల్పోయిన సంద‌ర్భం గురించి కూడా చెప్పాను' అని బోల్డ్ స్టేట్‌మెంట్లు ఇచ్చాడు. పాండ్యాతో పాటు కేఎల్ రాహుల్ కూడా కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు.

ఈ నేపథ్యంలో హార్థిక్ పాండ్యాతో పాటు కేఎల్ రాహుల్‌కు బీసీసీఐ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. వారు చేసిన వ్యాఖ్యలకు 24 గంటల్లోగా వివరణ ఇవ్వాలని బీసీసీఐ నోటీసులలో పేర్కొంది. వివరణ ఇవ్వని పక్షంలో కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.