ఏపిలో పెన్షన్ పెంపుపై హర్షం

ఏపిలో పెన్షన్ పెంపుపై హర్షం

ఆంధ్రప్రదేశ్ లో పెన్షన్ పెంపు నిర్ణయం పై సర్వత్రా హర్షం వ్యక్తమవుతుంది. పెన్షన్ పెంచినందుకు ధన్యవాదాలు తెలపడానికి వచ్చిన లబ్ధిదారులకు విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమా స్వీట్లు పంచారు. చంద్రబాబు చిత్రపటానికి పెన్షనర్లు పాలాభిషేకం చేసారు. పెన్షన్ రెండు వేలకు పెంచినందుకు సీఎంకు ధన్యవాదాలు తెలిపారు.రాష్ట్రం ఆర్థిక ఇబ్బందులలో ఉన్నప్పటికి పెన్షన్ రెట్టింపు చేసిన సిఎం చంద్రబాబుకి రుణపడి ఉంటామని లబ్ధిదారులు అన్నారు..