విసిగిపోయా... వెళ్లిపోతున్నా...

విసిగిపోయా... వెళ్లిపోతున్నా...

గన్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నా ప్రముఖ ఆధ్యాత్మిక గురువు, మధ్యప్రదేశ్ మంత్రి భయ్యూ మహారాజ్... రాసిన సూసైడ్ లేఖను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇండోర్‌లో తలపై తనను తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్న మహారాజ్ ఇంట్లో సూసైడ్ లేఖ దొరికింది. డైరీలో ఓ చిన్న పేజీలో సూసైడ్ లేఖ లభ్యం కాగా... కుటుంబ సమస్యలే కారణమని పేర్కొన్నారు. ఇండోర్‌లోని తన ఇంట్లో ఈ రోజు మధ్యాహ్నం తనను తాను గన్‌తో కాల్చుకున్న మహారాజ్‌ను సమీపంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా... అప్పడికే ఆయన మృతిచెందినట్టు వైద్యులు నిర్ధారించారు. 

డైరీలోని ఒక చిన్న పేజీలో వ్రాసిన సూసూడ్ నోట్‌లో 'కుటుంబ బాధ్యతను ఎవరైనా చూడండి... నేను వదిలేసి వెళ్తున్నా... కుటుంబ సమస్యలతో చాలా విసిగిపోయాను' అని పేర్కొన్నారు. కాగా, షుజ్లాపూర్‌లో ఓ రైతు కుంటుంబంలో జన్మించిన ఆయన అసలు పేరు ఉదయ్ సింగ్ దేశ్‌ముఖ్... ఇండోర్‌లోని తన ఇంట్లో ఉన్న ఆశ్రమం, ట్రస్ట్ ద్వారా సామాజిక కార్యాక్రమాలను అమలు చేశారు. భయ్యూ మహారాజ్ మొదటి భార్య మాధవి ఇప్పటికే మృతిచెందగా... ఆమె కుమార్తె ప్రస్తుతం పుణెలో చదువుకుంటోంది. యూపీఏ హయాంలో అన్నా హజారే నేతృత్వం జరిగిన అవినీతి వ్యతిరేక ఉద్యమ సమయంలో మహారాజ్ రాజీ ప్రయత్నాలు చేసి ఒప్పించారు. మాజీ రాష్ట్రపతి ప్రతిభా పాటిల్, ప్రధాని నరేంద్ర మోడీ, శరద్ పవార్, లతా మంగేష్కర్, ఉద్ధవ్ థాకరే, రాజ్ థాకరే, ఆశా భోంస్లే లాంటి చాలా మంది ప్రముఖులు ఆయన ఆశ్రమాన్ని సందర్శించినవారే.