రాజకీయ నాయకుడు కాదు.. నాయకుడు

రాజకీయ నాయకుడు కాదు.. నాయకుడు
సూపర్ స్టార్ మహేష్‌బాబు, సూపర్‌ డైరెక్టర్‌ కొరటాల శివ కాంబినేషన్‌లో రూపుదిద్దుకున్న సినిమా ''భరత్ అనే నేను''. ఈ నెల 20న సినిమా విడుదలవుతున్న నేపథ్యంలో సినిమా యూనిట్‌ ప్రొమోషన్స్‌ స్పీడ్‌ పెంచింది. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై డీవీవీ దానయ్య ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈరోజు ఎల్‌బీ స్టేడియంలో జరిగిన 'బహిరంగ సభ'లో సినిమా థియేట్రికల్‌ ట్రైలర్‌ను యంగ్ టైగర్‌ ఎన్టీఆర్‌ లాంచ్‌ చేశారు. 'తప్పు జరిగితే కొంచెం కఠినంగా ఉండి దాన్ని కరెక్ట్‌ చేయడానికి ట్రై చేస్తే, నీకు రాచరికం, రాజులు గుర్తొచ్చారు. కానీ, నాకు మాత్రం చిన్నప్పుడు తప్పు చేస్తే దండించిన మా అమ్మా, నాన్న గుర్తొచ్చారు' అంటూ మహేష్‌బాబు వాయిస్‌తో ఈ థియేట్రికల్‌ ట్రైలర్‌ ప్రారంభమవుతుంది. 'ఎట్టకేలకు ఒక్కడు వచ్చాడు. రాజకీయ నాయకుడు అనుకున్నా. నాయకుడు' అంటూ రావు రమేష్‌ డైలాగ్‌.. సినిమా థీమ్‌ను తెలియచెబుతుంది. 'త్వరలోనే మీ అందరినీ మాట మీద నిలబడే మగాళ్లను చేస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నా' అంటూ మహేష్‌బాబు సూపర్‌ పంచ్‌తో ఈ ట్రైలర్‌ ముగుస్తుంది. కాగా.. చాలా రోజుల తర్వాత సీనియర్‌ నటుడు దేవరాజ్‌ ఈ సినిమాలో కనిపించనున్నాడు. https://youtu.be/KMWS5y2gZ6E