ముగిసిన భావనపాడు పోర్టు ప్రజాభిప్రాయసేకరణ

ముగిసిన భావనపాడు పోర్టు ప్రజాభిప్రాయసేకరణ

భావనపాడు పోర్టు ప్రజాభిప్రాయసేకరణ ముగిసింది. పోర్టు నిర్వాసిత హక్కుల సాధన కమిటీ పలు డిమాండ్లను అధికారుల ముందు ఉంచింది. పోర్టుకు అంగీకరించాలంటే పోర్టు నిర్మాణానికి ముందే  ఫిషింగ్ హార్బర్ ను నిర్మించాల్సిందే అని వారు డిమాండ్ చేశారు. తాము కోల్పోతున్న దాని కంటే ఎక్కువగా.. ఆర్ఆర్ ప్యాకేజీ. ఇళ్లు, స్థలాలు కోల్పోతున్న వారికి ప్రస్తుతం ఉన్న ధరకు ఐదు రెట్ల  ధర. నిర్వాసిత గ్రామ ప్రజలకు ఉద్యోగాలు. నిర్వాసిత కాలనీల్లో మౌలిక సౌకర్యాలు కల్పించాలని పోర్టు నిర్వాసిత హక్కుల సాధన కమిటీ డిమాండ్ చేసింది.