వీడియో: 'బ్యాట్'తో టాస్

వీడియో: 'బ్యాట్'తో టాస్

ఆస్ట్రేలియా దేశీవాలీ లీగ్‌లలో టాస్ వేసేందుకు కాయిన్‌కు బదులు బ్యాట్‌ను వాడుతున్నారు. ఈ నేపథ్యంలో బిగ్ బాష్ లీగ్‌లో భాగంగా సిడ్నీ తండర్స్, హోబర్ట్ హర్రికేన్స్ జట్ల మధ్య జరుతున్న మ్యాచ్‌లో బ్యాట్‌తో టాస్ వేశారు. తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో సిడ్నీ తండర్స్ కెప్టెన్ షేన్ వాట్సన్ టాస్ నెగ్గి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. హోబర్ట్ హర్రికేన్స్ జట్టుకు మత్యు వేడ్ నాయకత్వం వహిస్తున్నాడు. టాస్ వేయడానికి బ్యాట్‌ను వాడడంతో.. బిగ్ బాష్ లీగ్‌ పాత పద్ధతిని మళ్లీ అమల్లోకి తెచ్చింది. ఈ వీడియోను క్రికెట్ ఆస్ట్రేలియా ట్విట్టర్ లో పోస్ట్ చేసింది.