కనిష్ట, గరిష్ట ఉష్ణోగ్రతల్లో భారీగా వ్యత్యాసం

కనిష్ట, గరిష్ట ఉష్ణోగ్రతల్లో భారీగా వ్యత్యాసం

తెలంగాణ వ్యాప్తంగా పగలు ఎండ, రాత్రి చలి గాలులు వీస్తున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. కనిష్ట, గరిష్ట ఉష్ణోగ్రతల్లో భారీగా వ్యత్యాసం నమోదవుతుండటంతో ఈ పరిణామాలు చోటు చేసుకుంటున్నట్లు పేర్కొంది. ఉపరితల ద్రోణి కారణంగా హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో సోమ, మంగళవారాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. బంగాళఖాతంలో ఏర్పడిన ఉపరితల ద్రోణి ప్రభావంతో ఉష్ణోగ్రతలు సైతం తగ్గుముఖం పట్టి, చలి ప్రభావం స్వల్పంగా పెరిగిందని పేర్కొంది. గాలిలో తేమశాతం భారీగా పడిపోవడంతో మధ్యాహ్నం సమయంలో కొంత ఉక్కపోతగా ఉంటుందని తెలిపింది.