అభిమానులకు నాగార్జున బర్త్ డే గిఫ్ట్ ఏంటో తెలుసా !

అభిమానులకు నాగార్జున బర్త్ డే గిఫ్ట్ ఏంటో తెలుసా !

రేపు ఆగష్టు 29న అక్కినేని నాగార్జున పుట్టినరోజు కావడంతో అభిమానులకు కానుకగా నాగ చైతన్య తన నూతన చిత్రం 'శైలజారెడ్డి అల్లుడు' ట్రైలర్ ను విడుదలచేయాలని నిర్ణయించారు.  ఈ మధ్యే విడుదలైన టీజర్, పాటలకు మంచి రెస్పాన్స్ లభించడంతో సినిమాపై హైప్ మరింత ఎక్కువైంది. 

సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై మారుతి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో అను ఇమ్మాన్యుయేల్ కథానాయకిగా నటించగా, రమ్యకృష్ణ ఆమెకు తల్లిగా నటించారు.  ఈ ఫ్యామిలీ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ ను సెప్టెంబర్ 13న విడుదలచేయనున్నారు.