టీఆర్ఎస్ పాస్ మార్కులు కూడా పొందలేదు

టీఆర్ఎస్ పాస్ మార్కులు కూడా పొందలేదు

టీఆర్ఎస్ ఏవైతే హామీలు ఇచ్చిందో వాటిని నెరవేర్చడంలో పాస్ మార్కులు కూడా పొందలేదని హర్యానా వ్యవసాయ శాఖ మంత్రి ఓం ప్రకాష్ దంకర్ విమర్శించారు. ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడుతూ... హర్యానాలో రైతుల కోసం ప్రత్యేక కార్యక్రమాలు, రిస్క్ మానేజ్మెంట్ వ్యవస్థను ఏర్పాటు చేసాం. కానీ ఇక్కడ రైతులను మోసం చేశారన్నారు. ఇక్కడ అధికారం అంతా ఒకే కుటుంబం చేతిలో ఉందన్నారు. పంజాబ్ పార్టీ అకాలీదళ్ హర్యానాలో రాజకీయాలు చేసి అధికారంలోకి వస్తే పంజాబ్ కి ప్రాధాన్యత ఇస్తుందా.. హర్యానకి ఇస్తుందా?. ఇక్కడ కూడా టీడీపీ అధికారంలోకి వస్తే ఆ పార్టీ ప్రాధాన్యత ఆంధ్రకే ఇస్తదన్నారు. ఒక కుటుంబం కోసం ఓటు వేయడం కాకుండా తెలంగాణ కోసం ఓటు వేయాలని దంకర్ పిలుపునిచ్చారు. బీజేపీ తెలంగాణలో మంచి మ్యానిఫెస్టోను ప్రజల ముందు ఉంచింది.. బీజేపీని గెలిపించండని కోరారు.