బీజేపీ మమ్మల్ని కాపీ కొట్టింది

బీజేపీ మమ్మల్ని కాపీ కొట్టింది

ఇవాళ బెంగళూరులో విడుదల చేసిన బీజేపీ మేనిఫెస్టోలో కీలక పథకాలు తమ నుంచి తీసుకున్నవేనని తెలంగాణ మంత్రి కేటీఆర్‌ అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మిషన్‌ కాకతీయను మిషన్‌ కళ్యాణి అని కళ్యాణ లక్ష్మీ పథకాన్ని  వివాహ మంగళ యోజన పేరుతో అమలు చేస్తామని బీజేపీ తన మేనిఫెస్టోలో వాగ్ధానం చేశారని ట్వీట్‌ చేశారు. అలాగే లక్ష రూపాయల వరకు రుణ మాఫీ అమలు చేసిన తమ పథకాన్ని బీజేపీ తీసుకుందన్నారు. పరిశ్రమలకు సింగిల్‌ విండో ద్వారా క్లియరెన్స్‌లు ఇస్తామని బీజేపీ చేసిన హామి.. తమ టీఎస్‌ ఐపాస్‌ పద్ధతే ప్రేరణ అని కేటీఆర్‌ అన్నారు. తమ టీ హబ్‌ కాస్తా అక్కడ కే హబ్‌గా మారిందని, జీహెచ్‌ఎంసీ అమలు చేస్తున్న అన్నపూర్ణ తరహాలోనే ముఖ్యమంత్రి అన్నపూర్ణ క్యాంటీన్లు అనే పథకాన్ని బీజేపీ హామి ఇచ్చిందన్నారు.