ప్రేమోన్మాది దాడిపై కిషన్ రెడ్డి ఆక్రోశం

ప్రేమోన్మాది దాడిపై కిషన్ రెడ్డి ఆక్రోశం

ప్రేమోన్మాది దాడి లో ఇంటర్ అమ్మాయి పరిస్థితి విషమంగా ఉందని బిజెపి మాజీ ఎమ్మెల్యే కిషన్ రెడ్డి అన్నారు. బాధితురాలిని పరామర్శించిన అనంతరం కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. సభ్య సమాజం తలదించుకునేలా ఈ దాడి జరిగిందని ఆవేదన వ్యక్తం చేసారు. సమాజం ఎటు వెళుతుందో తెలియజేయడానికి ఈ ఘటన నిదర్శనమని వ్యాఖ్యానించారు.యువత పెడదారి పడుతున్నారని వాపోయిన కిషన్ రెడ్డి, ఈ దాడికి కారణమైన భరత్ ను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేసారు. ఇలాంటి దారుణాలు జరగకుండా, సమాజంలో ఉన్న అన్ని వర్గాలు ఆలోచన చేయాలని కోరారు.