రామ్ మందిర్ నిర్మాణానికి కట్టుబడే ఉన్నాం

రామ్ మందిర్ నిర్మాణానికి కట్టుబడే ఉన్నాం

అయోధ్యలో రామ మందిర్ నిర్మాణం త్వరలో చేపట్టేందుకు కట్టుబడే ఉన్నామని బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా వెల్లడించారు. ఢిల్లీ రామ్ లీలా మైదాన్ లో జరుగుతున్న రెండ్రోజులు బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశంలో పాల్గొన్న అమిత్ షా...మందిర నిర్మాణానికి కాంగ్రెస్ పార్టీ అడ్డుకట్ట వేస్తోందని ఆరోపించారు. కేసు పరిష్కారమైన వెంటనే మందిర్ నిర్మాణ పనులు ప్రారంభిస్తామని వెల్లడించారు. బీజేపీ అయోధ్యలోని స్థలంలో పెద్ద మందిర్ నిర్మాణం చేపట్టనుందని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ మందిర్ నిర్మాణంపై తమ వైఖరిని తెలియజేయాలని కోరారు. 2019 ఎన్నికలతో మోడీ ప్రపంచంలో అత్యంత ప్రజా ఆధరణ కలిగిన నేతగా ఎదుగుతారని ఆయన తెలిపారు. మోడీ ఒక్కరు ఒకవైపు.... మిగిలిన వారంతా ఓవైపు... అని ఆయన పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో మళ్లీ బీజేపీ అధికారంలోకి వస్తుందని షా ధీమా వ్యక్యం చేశారు. ఈ ఎన్నికల్లో బీజేపీ విజయం అత్యంత ఆవశ్యకం అని ఆయన వెల్లడించారు. ప్రపంచలో మోడీ అంతా ప్రజా ఆధరణ కలిగిన నాయకుడు ఎవ్వరూ లేరని స్పష్టం చేశారు. ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్ గాంధీ ఆధారాలు లేని ఆరోపణలు చేస్తున్నారని అమిత్ షా విమర్శించారు.