కర్నాటకలో బీజేపీకి తెలుగోడి దెబ్బ..

కర్నాటకలో బీజేపీకి తెలుగోడి దెబ్బ..

ప్రత్యేక హోదా విషయంలో మాట మార్చిన బీజేపీపై తెలుగు ప్రజలు ప్రతీకారం తీర్చుకున్నారు. ఏపీ సరిహద్దు జిల్లాల్లోని నియోజకవర్గాల్లోని మెజారిటీ స్థానాల్లో కమలం పార్టీని ఓడించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలతో సుదీర్ఘమైన సరిహద్దు కలిగి ఉంది కర్ణాటక. తెలంగాణను పక్కనపెడితే.. ఏపీ సరిహద్దు జిల్లాల్లోని తెలుగువాళ్లందరూ బీజేపీ ఓడిపోవాలని కోరుకున్నారు. కొంతమంది నేతలు ఆ రాష్ట్రానికి వెళ్లి ప్రచారం కూడా చేశారు. ఇవాళ విడుదలైన ఫలితాలను బట్టి చూస్తే.. వారి కష్టం ఫలించినట్టే ఉంది.  
ఆంధ్రప్రదేశ్‌ సరిహద్దులోని 5 జిల్లాల్లో మొత్తం 32 నియోజకవర్గాలున్నాయి. వీటిలో కేవలం 8 సీట్లనే బీజేపీ గెలవగలిగింది. రెండు జిల్లాల్లో కనీసం ఒక్క చోట కూడా గెలవలేకపోయింది. కోలార్ లోని 6, చిక్కబళ్లాపురలోని 5 సీట్లలో బీజేపీ ఒక్క సీటు కూడా దక్కించుకోలేకపోయింది.  రాయచూర్‌లో 7కి 2, బళ్లారి జిల్లాలో 9కి 3 సీట్లే కమలం గెలుపొందింది.  కొప్పళ జిల్లాలో 5 సీట్లుండగా బీజేపీకి 3 దక్కాయి.