మళ్లీ పోటీ చేస్తా.. ఏ పార్టీ నుంచి అంటే...!?

మళ్లీ పోటీ చేస్తా.. ఏ పార్టీ నుంచి అంటే...!?

భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు చేసిన ప్రకటన మరోసారి చర్చనీయాంశంగా మారింది... వచ్చే ఎన్నికల్లో తాను ప్రస్తుతం ప్రాతినిథ్యం వహిస్తున్న విశాఖ నార్త్‌ నియోజకవర్గం నుంచే పోటీ చేస్తానని ప్రకటించిన ఆయన... కానీ, ఏపార్టీ నుంచి పోటీ చేస్తారనే విషయంలో మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. జన్మభూమి ఆరో విడుతలో భాగంగా నిర్వహించిన గ్రామ సభలో ఆయన మాట్లాడుతూ... ఏపీలో బీజేపీ పరిస్థితి ఎలా ఉందో ప్రజలకు తెలుసని... వాస్తవ పరిస్థితిని బీజేపీ అధిష్టానానికి చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. అయితే, రాష్ట్రంలో బీజేపీ పరిస్థితి అద్భుతంగా ఉందని చెప్పే సాహసం చేయొద్దని వ్యాఖ్యానించారు విష్ణుకుమార్ రాజు. కాగా, విష్ణుకుమార్‌ రాజు త్వరలోనే పార్టీ మారుతారంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున్న ప్రచారం జరుగుతోంది... బీజేపీకి గుడ్‌బై చెప్పి టీడీపీలో చేరతారనే ప్రచారం సాగుతోంది.