సవాల్ విసిరి... 144 సెక్షన్ పెడతారా?

సవాల్ విసిరి... 144 సెక్షన్ పెడతారా?

పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో ఈ ఉదయం నుంచి జరిగిన పరిణామాలపై మండిపడ్డారు భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు... చర్చకు పలిచి, సవాల్ విసిరి 144 సెక్షన్ పెట్టడం దిగజారుడు తనమే అవుతుందన్నారాయన. తాడేపల్లిగూడెం ఎమ్మెల్యేని మాత్రమే ఇబ్బందిపెట్టే విధంగా జెడ్పీ చైర్మెన్ బాపిరాజు వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసిన వీర్రాజు... 40 ఏళ్ళ రాజకీయ అనుభవం ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు... బాపిరాజుని మాత్రం కంట్రోల్ చేయలేకపోతున్నారంటూ సెటైర్లు వేశారు. బీజేపీ బలపడుతోందనే కుట్రలు చేస్తున్నారన్న సోము వీర్రాజు... మాజీ మంత్రి మాణిక్యాలరావు ఇంట్లోకి చోరబడి అరెస్టులు చేస్తారా? అంటూ మండిపడ్డారు.