హైదరాబాద్‌లో బీజేపీ విజయోత్సవ ర్యాలీ...

హైదరాబాద్‌లో బీజేపీ విజయోత్సవ ర్యాలీ...

కాంగ్రెస్, బీజేపీ మధ్య ప్రతిష్టాత్మకంగా జరిగిన కర్నాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు బీజేపీకి అనుకూలంగా ఉన్నాయి. ఇప్పటి వరకు వచ్చిన ట్రెండ్స్ ప్రకారం బీజేపీ సొంతంగా అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో కర్ణాటకలో బీజేపీ విజయం దాదాపు ఖాయంగా కనిపిస్తుంది. అయితే బీజేపీ విజయం సాధించడం పట్ల ఈ రోజు మధ్యాహ్నం హైదరాబాద్ లో విజయోత్సవ ర్యాలీ నిర్వహిస్తామని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు డాక్టర్ కె. లక్ష్మణ్ తెలిపారు. కర్ణాటక ప్రజలు బీజేపీని ఆదరించడం శుభపరిణామన్నారు. దేశం మొత్తం నరేంద్రమోదీ పరిపాలనను ప్రజలు కోరుకుంటున్నారని.. అందుకే ప్రతి రాష్ట్రంలోనూ బీజేపీయే అధికారంలోకి వస్తుందన్నారు. మధ్యాహ్నం జరిగే విజయోత్సవ ర్యాలీలో పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొనాలని ఆయన కోరారు.