14 నుంచి ఇంటర్ సప్లమెంటరీ పరీక్షలు

 14 నుంచి ఇంటర్ సప్లమెంటరీ పరీక్షలు

ఈ నెల 14 నుంచి 21వ తేదీ వరకు ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లమెంటరీ పరీక్షలు నిర్వహించేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేశామని తెలంగాణ ఇంటర్ బోర్డ్ సెక్రటరీ అశోక్ కుమార్ తెలిపారు. ఉదయం 9 గంటల తర్వాత ఒక నిమిషం ఆలస్యం అయినా లోపలికి అనుమతించేది లేదని ఆయన ఈ సందర్భంగా వెల్లడించారు. ఉదయం 8 గంటల నుంచే విద్యార్థులను పరీక్ష కేంద్రంలోకి అనుమతిస్తామని ఇంకా మరితం సమాచారం కోసం 04026401010 టోల్ ఫ్రీ నెంబర్ కు కాల్ చేసి తెలుసుకోవచ్చని వివరించారు. 

ఇంకా ఆయన మాట్లాడుతూ... మొత్తం ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లమెంటరీ పరీక్ష రాస్తున్న విద్యార్థులు 4.20వేల మంది కాగా ఇంప్రూమెంట్ రాస్తున్న విద్యార్థులు 1.25 వేల మంది ఉన్నారు. 2.56 ప్రథమ సంవత్సరం విద్యార్థులు పరీక్ష రాస్తుండగా.. పరీక్ష పత్రాలు సీసీ కెమెరాల సమక్షంలోనే విడుదల చేయాలని తెలిపారు. అలాగే.. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 819 పరీక్ష సెంటర్లు.. 819 సూపరింటెండెంట్స్, డిపార్ట్మెంట్ ఆఫీసర్లు నియమించామని వెల్లడించారు. ఈ పరీక్షల కోసం 50 ఫ్లయింగ్ స్కాడ్స్, 200 సిట్టింగ్ స్కాడ్స్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇంకా ఆయన మాట్లాడుతూ.. 'మే 21 నుంచి ఇంటర్ అడ్మిషన్లు ప్రారంభిస్తాం. ఆన్లైన్ అడ్మిషన్లు చేయడం లేదు. అనుమతి లేకుండా హాస్టల్స్ నిర్వహించవద్దు. 13 హాస్టల్స్ కు మాత్రమే అనుమతి ఇచ్చాము. ఇంకా 500 హాస్టల్స్ కు అనుమతి లేదు. హాస్టల్స్ కు అనుమతి ఇచ్చే అధికారం ఇంటర్ బోర్డుకు ఉంది. విద్యార్థుల ఆత్మహత్యలు హాస్టల్స్ లోనే ఎక్కువ జరుగుతున్నాయి. కొందరు హాస్టల్స్ యజమానులు కోర్టుకు వెళ్లారు. కోర్టు ఎలాంటి స్టేలు ఇవ్వలేదు. వేసవిలో ఇంటర్ తరగతులు నిర్వహిస్తున్న 700 కాలేజీలకు తాళాలు వేసి నోటిసులు ఇచ్చాము.' అని ఈ సందర్భంగా అశోక్ కుమార్ తెలిపారు.