ఆ ముస్లింల దేశభక్తి భారతీయులందరికి ఆదర్శం

ఆ ముస్లింల దేశభక్తి భారతీయులందరికి ఆదర్శం

మధ్యప్రదేశ్ ఇండోర్ లో ఇమామ్ హుస్సేన్ వర్థంతి సందర్భంగా నిర్వహించిన ఆశారా ముబారకా కార్యక్రమంలో పాల్గొనేందుకు ప్రధాని మోడీ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తూ, దావూడీ బోరా వర్గీయుల దేశభక్తి భారతీయులందరికీ ఆదర్శమని తెలిపారు. బోరా సమాజం శాంతి సందేశంతో జీవిస్తుందని, సయ్యద్నా ముఫ్దాల్ సైపుద్దీన్ తన ప్రసంగాల్లో మాతృభూమిని ప్రేమించాలని బోధిస్తారని మోడీ తెలిపారు.

ఆశారా ముబారకాతో ఇస్లామిక్ సంవత్సరం ప్రారంభం అవుతుందని, ఈ కాలాన్ని మహ్మద్ ప్రవక్త మనవడు ఇమామ్ హుస్సేన్‌ గౌరవార్థం ఆయనకు అంకితం చేస్తారని తెలిపారు. గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో బోరా వర్గీయులతో సన్నిహిత సంబంధాలు ఉండేవని ప్రధాని మోడీ గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా బోరా మతపెద్ద సయ్యద్నా ముఫ్దాల్ సైఫుద్దీన్‌ను కలిశారు. ఈ ఏడాది చివర్లో మధ్యప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన ఇండోర్ లో పర్యటించడం ప్రాధాన్యత సంతరించుకుంది.