సాహో కోసం బాలీవుడ్ కొరియోగ్రఫర్స్ !

సాహో కోసం బాలీవుడ్ కొరియోగ్రఫర్స్ !

 

'సాహో' చిత్రాన్ని అన్ని హంగులతో భారీగా నిర్మిస్తున్నారు నిర్మాతలు.  ఈ చిత్రంలో ప్రభాస్, శ్రద్ద కపూర్ మధ్య మూడు పాటలు ఉండనున్నాయి.  వాటిలో ఒక పాటను బాలీవుడ్ స్టార్ కొరియోగ్రఫర్లు బోస్కో సీజర్ కంపోజ్ చేయనున్నారు.  హిందీ పరిశ్రమలో అనేక మంది స్టార్ హీరోల సినిమాలకు డ్యాన్సులు కంపోజ్ చేసిన అనుభవం వీరికుంది.  అందుకే వీరిని తీసుకున్నారట మేకర్స్.  సుమారు 150 కోట్ల భారీ వ్యయంతో నిర్మితమవుతున్న ఈ సినిమా ఇప్పటికి సంగం వరకు పూర్తైంది.  ఆగష్టు 15న విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు.  తెలుగుతో పాటు హిందీ భాషలో కూడా సినిమా రూపొందుతోంది.  ఈ రెండు భాషలే కాకుండా ఇంకొన్ని భాషల్లోకి చిత్రం అనువాదం కానుంది.