మిలీనియం సెల్ఫీ

మిలీనియం సెల్ఫీ

సినిమా ఇండస్ట్రీలో నిత్యం ఏదో ఒక సమస్య ఉంటూనే ఉంటుంది.  సినిమా ఇండస్ట్రీ చిన్నదేం కాదు.  వచ్చే సమస్యలు కూడా అలాగే ఉంటాయి.  చిన్నవైతే అక్కడికక్కడే పరిష్కరించుకుంటారు.  టోటల్ గా ఇండస్ట్రీకి సంబంధించిన సమస్య వస్తే.. పరిష్కారం ఎక్కడుందో అక్కడికి వెళ్తేనే సమాధానం దొరుకుతుంది.  

సినిమా టికెట్స్ రేటు, ఇండస్ట్రీలో మౌళిక వసతుల కల్పన వంటి సమస్యలను ఇటీవలే ప్రధాని ముందుకు తీసుకెళ్లింది బాలీవుడ్ పరిశ్రమ.  సమస్యలపై స్పందించిన ప్రధాని, వాటిని పరిష్కరించడంతో కృతజ్ఞతలు తెలిపేందుకు ప్రధాని మోడీని కలిశారు.  ఈ సందర్భంగా అంతా కలిసి మోడీతో సెల్ఫీ దిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.  ఈ ఫోటో ఇప్పుడు వైరల్ గా మారింది.