శ్రీదేవి మొదటి వర్ధంతి.. చెన్నైలో..!!

 శ్రీదేవి మొదటి వర్ధంతి.. చెన్నైలో..!!

అతిలోక సుందరి శ్రీదేవి మరణించి అప్పుడే సంవత్సరం కావొస్తుంది.  ఫిబ్రవరి 24 వ తేదీ.. ఇండియా ఇంకా మేల్కోక ముందే శ్రీదేవి మరణించిందనే వార్తా రావంతో అందరు ఆశ్చర్యపోయారు.  దుబాయ్ లో ఓ వివాహ వేడుకకు హాజరు కావడానికి వెళ్లిన శ్రీదేవి.. హోటల్ లోని బాత్ రూమ్ టబ్ లో ప్రమాదవశాత్తు పడి మరణించింది.  

శ్రీదేవి మరణించి దాదాపు సంవత్సరం కావొస్తుంది.  శ్రీదేవి వర్ధంతి వేడుకలను చెన్నైలోని ఆమె స్వగృహంలో నిర్వహించాలని బోనికపూర్ ఫ్యామిలీ నిర్ణయించింది.  హిందీ క్యాలెండర్ ప్రకారం శ్రీదేవి వర్ధంతిని ఫిబ్రవరి 14 వ తేదీన నిర్వహిస్తున్నారట. బోనికపూర్ ఫ్యామిలీతో పాటు, అనిల్ కపూర్ ఫ్యామిలీ కూడా ఈ వర్ధంతి వేడుకలకు హాజరౌతున్నట్టు సమాచారం.